Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Times Square Stabbing: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళ అకస్మాత్తుగా కత్తితో ఇద్దరిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరోకరు గాయపడ్డాడు. అనంతరం పోలీసులు ఆమెపై జరిపిన కాల్పుల్లో నిందితురాలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 4:36 గంటలకు టైమ్స్ స్క్వేర్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో వేలాది మంది పర్యాటకులు, సాధారణ ప్రజలు ఆ ప్రాంగణంలో ఉన్నారు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే నిందితురాలు ఇద్దరిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం.. నిందితురాలిని 49 ఏళ్ల పమేలా సిస్నెరోస్‌గా గుర్తించారు. ఆమె 32 ఏళ్ల మహిళతో పాటు 68 ఏళ్ల వ్యక్తిపై కత్తితో దాడి చేసింది. మహిళ పొత్తికడుపులో కత్తిపోటు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరో బాధితుడికి కూడా పొత్తికడుపులో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేరే టైంలో అతడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో పింక్ షర్ట్, జీన్స్ ధరించిన నిందితురాలు చేతిలో కత్తితో పోలీసుల ఎదుట నిలబడి కనిపించింది. కత్తిని కిందపడేయడానికి ఆమె నిరాకరించడంతో పాటు పోలీసులను చంపేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
నిందితురాలిపై ముందు పోలీసులు టేజర్‌ను ప్రయోగించినప్పటికీ అది పనిచేయలేదు. దీంతో నిందితురాలు కత్తిని ఊపుతూ పోలీసుల వైపు ముందుకు వెళ్లడంతో.. అధికారులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. నిందితురాలికి గతంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించిందని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. ప్రాథమికంగా ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా భావించడం లేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!