Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- బట్టలపై నూనె మరక పడిన వెంటనే..
- రుద్దకుండా ముందుగా పేపర్ టవల్‌తో మెల్లగా ఒత్తాలి..
- మరకపై కార్న్‌స్టార్చ్ లేదా బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు ఉంచాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొరపాటున పడుతుండడం సాధారణమే. వంట చేసేటప్పుడు కూర లేదా తాలింపు నూనె బట్టలపై పడటం, లేదా ఇతర జిడ్డు పదార్థాలు బట్టలకు అంటుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే నూనె మరకలను సాధారణంగా ఉతికినంత మాత్రాన పూర్తిగా పోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మరక పడిన వెంటనే శుభ్రం చేయకుండా కొంతసేపు అలాగే వదిలేస్తే మరింత ఇబ్బందిగా మారుతుంది.
నిజానికి నూనె, నీరు రెండూ అంత సులువుగా కలవవు. అందుకే నూనె మరక పడిన బట్టను వెంటనే నీళ్ల కింద పెట్టి రుద్దడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అంతేకాదు మరక బట్టలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది.
Also Read
- Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
- Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
- Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
- Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే 'వెజిటబుల్ బిర్యానీ' ఇలా చేసేయండి..!
ముందుగా పౌడర్ వేయాలి..
నూనె మరక పడిన వెంటనే ఆ ప్రాంతంపై కార్న్‌స్టార్చ్ లేదా బేకింగ్ సోడా వేయడం కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి బట్టపై ఉన్న నూనెను కొంతమేర పీల్చుకోవడానికి సహాయపడతాయి. ముందుగా శుభ్రమైన తెల్లటి వస్త్రం లేదా పేపర్ టవల్‌తో మరకపై మెల్లగా ఒత్తుతూ నూనెను తొలగించాలి. ఆ సమయంలో బట్టను అటూ ఇటూ రుద్దకూడదు. అలా చేస్తే నూనె బట్ట దారాల్లోకి మరింతగా వెళ్లే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత మరక ఉన్న ప్రాంతాన్ని కార్న్‌స్టార్చ్ లేదా బేకింగ్ సోడాతో పూర్తిగా కప్పి కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మరక ఎక్కువగా ఉంటే లేదా బట్ట మందంగా ఉంటే సుమారు 30 నిమిషాల వరకు ఉంచవచ్చు. తర్వాత పౌడర్‌ను గట్టిగా రుద్దకుండా మెల్లగా దులిపేయాలి. అవసరమైతే మెత్తటి బ్రష్ లేదా చెంచా వెనుక భాగంతో సున్నితంగా తొలగించవచ్చు. పౌడర్ రంగు మారడం లేదా అక్కడక్కడా అతుక్కుపోవడం కనిపిస్తే అది నూనెను పీల్చుకున్నట్లు అర్థం.
మరకను తొలగించడానికి సులభమైన పద్ధతి..
పౌడర్‌ను తొలగించిన తర్వాత మరక ఉన్న ప్రాంతంలో కొద్దిగా డిష్ సోప్ వేయాలి. ఈ సమయంలో డిష్ సోప్‌ను ముందుగా నీటిలో కలిపి పలుచగా చేయాల్సిన అవసరం లేదు. వేలితో లేదా మెత్తటి టూత్‌బ్రష్‌తో డిష్ సోప్‌ను బట్టపై సున్నితంగా రుద్దాలి. చిన్న చిన్న వృత్తాకార కదలికలతో సుమారు 60 నుంచి 90 సెకన్ల పాటు రుద్దితే సరిపోతుంది.
డిష్ సోప్ లోని శుభ్రపరిచే పదార్థాలు నూనెతో కలిసేందుకు సహాయపడతాయి. దీంతో నూనెను తర్వాత నీటితో సులభంగా తొలగించవచ్చు. డిష్ సోప్ రాసిన తర్వాత బట్టలోని మరక ఉన్న భాగాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత బట్టను వెలుతురులో పరిశీలించి మరక పూర్తిగా పోయిందో లేదో చూడాలి. ఇంకా కొద్దిగా మరక కనిపిస్తే డిష్ సోప్‌ను మరోసారి రాసి ఇదే విధానాన్ని పునరావృతం చేయవచ్చు.
ఎలా ఉతకాలి.?
మరక చాలావరకు తొలగిపోయిన తర్వాత బట్టను చల్లటి నీటిలో ఎంజైమ్లతో కూడిన లాండ్రీ డిటర్జెంట్ ఉపయోగించి ఉతకవచ్చు. వాషింగ్ మెషీన్లో ఉతికిన వెంటనే డ్రైయర్‌లో వేయడం మాత్రం చేయకూడదు. ముందుగా మరక ఉన్న ప్రాంతాన్ని మరోసారి జాగ్రత్తగా పరిశీలించాలి. మరకకు సంబంధించిన చిన్న గుర్తు కూడా మిగిలి ఉంటే బట్టను ఆరబెట్టే ముందు మరోసారి అదే ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. డ్రైయర్ లోని వేడి కారణంగా మిగిలిపోయిన నూనె మరక బట్ట రేశాల్లో మరింతగా స్థిరపడే అవకాశం ఉంటుంది. ఒకసారి అలా జరిగితే దాన్ని తొలగించడం మరింత కష్టమవుతుంది.
నూనె మరకలకు వేడి నీరు.?
నూనె మరకలపై వేడి నీటిని ఉపయోగించకపోవడం మంచిది. వేడి కారణంగా నూనె బట్ట దారాలకు మరింత బలంగా అంటుకునే అవకాశం ఉంటుంది. అలాగే నూనె మరక పూర్తిగా తొలగిపోయిందని నిర్ధారించుకునే వరకు బట్టను డ్రైయర్‌లో వేయకూడదు. ఇంకా కాటన్, పాలిస్టర్ వంటి సాధారణ బట్టలపై కార్న్‌స్టార్చ్, బేకింగ్ సోడా, డిష్ సోప్ ఉపయోగించే ఈ పద్ధతిని సాధారణంగా ప్రయత్నించవచ్చు. డెనిమ్ వంటి మందమైన బట్టలు కూడా ఈ విధానాన్ని తట్టుకోగలవు. అయితే సిల్క్, జార్జెట్, క్యాష్మీర్ వంటి సున్నితమైన బట్టల విషయంలో ఇంట్లోనే ప్రయోగాలు చేయడం మంచిది కాదు. నీరు లేదా డిష్ సోప్‌ను తప్పుగా ఉపయోగిస్తే బట్ట ఆకృతి, రంగు లేదా ఫినిష్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బట్టపై ‘డ్రై క్లీన్ ఓన్లీ’ అని సూచన ఉంటే ప్రొఫెషనల్ డ్రై క్లీనింగ్ సేవలను ఆశ్రయించడం ఉత్తమం.
తాజావార్తలు
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. సిక్కిం, బెంగాల్లోనూ ప్రకంపనలు..!
-
Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్‌కు పండగే!
-
Madurai Section 144: మధురైలో 144 సెక్షన్.. తిరుప్పరంకుండ్రం కొండపైకి భక్తులకు నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..