టైగర్ 3 సూపర్ డూపర్ హిట్ తర్వాత వరుస ప్లాప్స్ లు చూసిన సల్మాన్ ఖాన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సికందర్ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ ఫోర్త్ బాలీవుడ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సౌత్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న సికందర్ ఈద్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : Rithika : క్రేజీ ఆఫర్లు కొల్లగొడుతున్న యంగ్ బ్యూటీ
సికందర్ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న సల్మాన్.. తన అప్ కమింగ్స్ విశేషాలను పంచుకున్నాడు. అట్లీ ప్రాజెక్ట్ ఆగిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు కండల వీరుడు. బిగ్ బడ్జెట్ వల్లే సినిమా స్టాప్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. నెక్ట్స్ సంజయ్ దత్‌తో సినిమా చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. అనదర్ లెవల్ యాక్షన్ ఫిల్మ్స్‌గా తెరకెక్కబోతుందట. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై హిట్స్ ఇచ్చిన దర్శకుడు సూరజ్ భర్జాత్యతో కూడా డిస్కర్షన్ జరుగుతున్నట్లు చెప్పాడు. ఇన్ని సినిమాల లైనప్ ఉన్నా కూడా కొత్త కథలను వింటున్నాడట బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్. రీసెంట్లీ ఓ తమిళ దర్శకుడితో కథా చర్చలు జరిపినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అమరన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్ కుమార్ పెరియస్వామితో స్టోరీ డిస్కస్ చేసినట్లు టాక్. కథ నచ్చి కండల వీరుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న బజ్ నడుస్తోంది. సౌత్ దర్శకులను వరుసగా లైన్ లో పెడుతున్న సల్మాన్ ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో రానున్న రోజుల్లో తెలుస్తుంది.