ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండీ హీరోయిన్‌గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
Also Read : Kollywood : సూర్యకు పోటీగా శశి కుమార్.. గెలుపెవరిదో..?
2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రితికా నాయక్ ఫస్ట్ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీలో నాని – మృణాల్ యంగర్ డాటర్‌గా కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకోవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్లల్లో పడింది రితిక. వరుస ఆఫర్లు వచ్చిననప్పటికీ ఆచి తూచి సినిమాలను ఎంచుకుంది. సైలెంట్‌గా సినిమాలను పట్టాలెక్కిస్తోంది. ప్రస్తుతం రితికా నాయక్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. తేజా సజ్జాతో పాన్ ఇండియా మూవీ మిరాయ్‌లో నటిస్తోంది. ఆగస్టు1న థియేటర్లలోకి రాబోతుంది. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ చిత్రంలోను ఛాన్స్ కొట్టేసింది రితికా. ఏడాదిన్నర క్రితమే స్టార్టైన డ్యూయెట్ కూడా ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఇలా సైలెంట్‌గా క్రేజీ ప్రాజెక్టులను పట్టేస్తున్న ఈ ఢిల్లీ గర్ల్స్ వరుస హిట్స్ కొట్టి అగ్రహీరోల సరసన నటించాలని భావిస్తోందట.