Salman Khan : సల్మాన్ ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటాడు. గతంలో టెర్రరిస్టులపై చేసిన కామెంట్లు ఆయన్ను తీవ్ర విమర్శలకు గురి చేశాయి. దాని తర్వాత ఆయన అప్పుడప్పుడూ పాకిస్థాన్, ఇతర శత్రు దేశాలపై సానుకూలంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు తావిచ్చాయి. ఇప్పుడు మరో విషయంలో సల్మాన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. తాజాగా సౌదీలో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులో ఇండియన్ సినిమాల గురించి సల్మాన్ మాట్లాడారు.
Read Also : Bigg Boss 9 : నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే.. లవ్ ట్రాక్స్ కోసమే వచ్చావా రీతూ..
పశ్చిమ సౌత్ ఏసియా దేశాల్లో ఇండియన్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. తెలుగు, తమిళం, కన్నడ సినిమాలు ఎక్కడైనా వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో బాలీవుడ్ సినిమాలు ఈజీగా హిట్ అవుతాయి. ఇక్కడ గతంలోనే పాకిస్థాన్, బలూచిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారు అని తెలిపాడు సల్మాన్. కావాలనే అన్నాడో లేదంటే పొరపాటున అన్నాడో తెలియదు గానీ.. బలూచిస్థాన్ ను, పాకిస్థాన్ ను సల్మాన్ ఇలా వేరు చేసి మాట్లాడటంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే పాకిస్థాన్ నుంచి విడిపోయేందుకు బలూచిస్థాన్ తెగ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో సల్మాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Also : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ పవర్ ఫుల్ సినిమా.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..