Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈ సినిమా గురించి స్పందించింది. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పాలంటే నాకు ఒక రోజు మొత్తం కూడా సరిపోదు.
Read Also : Bigg Boss 9 : నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే.. లవ్ ట్రాక్స్ కోసమే వచ్చావా రీతూ..
ఎందుకంటే అది పవర్ ప్యాకెడ్ సినిమా. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. అందులో నా పాత్రకు సంబంధించి కొత్త ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. మిగతా షూట్ మొత్తం అయిపోయింది అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. ఆమె కామెంట్స్ తో ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఈ లెక్కన ఉస్తాద్ సినిమా ఊహకు మించి ఉంటుందేమో అని కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు అయిపోయింది. పవన్ కల్యాణ్ పాత్రకు సంబంధించి కొంత వరకు షూట్ మిగిలి ఉంటుందని అంటున్నారు.
Read Also : Chiranjeevi : చిరంజీవిని అలా చూసి నా మనసు ఉప్పొంగిపోయింది.. బండ్ల ఎమోషనల్