Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. ఇక నిన్న భరణి ఎలిమినేట్ అయిపోయాడు. పాపం అందరితో గొడవ అతన్ని ముంచేసింది. ఇక సోమవారంకు సంబంధించిన నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో రీతూ చౌదరిని ఆయేషా ఏకిపారేసింది. రీతూను డైరెక్ట్ నామినేట్ చేసింది ఆయేషా. దీనికి రీజన్ కూడా చెప్పింది. నువ్వు లవ్ కంటెంట్ కోసమే బిగ్ బాస్ కు వచ్చావ్ అంటూ చెప్పింది ఆయేషా. నేను చెప్పానా లవ్ చేస్తున్నాను అని రీతూ ఫైర్ అయింది.
Read Also : Chiranjeevi : చిరంజీవిని అలా చూసి నా మనసు ఉప్పొంగిపోయింది.. బండ్ల ఎమోషనల్
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎందుకే నీకంత ఓవర్ యాక్షన్, ఎందుకే అంత యాటిట్యూడ్ అంటూ ఆయేషా సీరియస్ అయింది. దానికి రీతూ కూడా బాగానే రియాక్ట్ అయింది. నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదు.. ఎవరి యాటిట్యూడ్ వారికి ఉంటుంది. అది నీ యాటిట్యూడ్ అయితే.. ఇది నా యాటిట్యూడ్ అంటూ చెప్పింది రీతూ. ఇలా ఇద్దరి మధ్య బాగానే మాటల యుద్ధం నడిచింది. ఈ వారం రమ్య, సాయి, రీతూ, తనూజ, దివ్య, రాము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది.
Read Also : Samantha : భోజనం చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా.. సమంత ఎమోషనల్