కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ టైమ్ కి సలార్ మేనియా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి కలెక్షన్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో ఇండియాలో మొదటిసారి రూపొందిన సినిమా కాబట్టి హాలీవుడ్ లో కూడా సలార్ ఇంగ్లీష్ వెర్షన్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది.
నెల రోజుల్లో రిలీజ్ ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ జోష్ ని మరింత పెంచుతూ పది రోజుల్లో సలార్ ట్రైలర్ బయటకి రానుంది. టెన్ డేస్ టు సలార్ ట్రైలర్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. డిసెంబర్ 1న సాయంత్రం 7:19 నిమిషాలకి సలార్ ట్రైలర్ బయటకి రానుంది. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన సలార్ టీజర్, రిలీజైన 24 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ట్రైలర్ ఏ రేంజులో డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఒక్కసారి ట్రైలర్ బయటకి వచ్చేస్తే… ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హైప్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం గ్యారెంటీ.
SALAAR TRAILER IN 11 DAYS pic.twitter.com/nVh2P4AR5E
— Salaar (@SalaarTheSaga) November 20, 2023