Sai Dharam Tej Talks About His Accident Incident: కొంతకాలం క్రితం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. హైటెక్ సిటీ నుంచి దుర్గం చెరువు వైపుకు రాయదుర్గం మార్గంలో తన బైక్ మీద వెళ్తుండగా.. రోడ్డు మీదున్న ఇసుక కారణంగా అతని బైక్ స్కిడ్ అయ్యింది. ఈ ప్రమాదంలో సాయి తేజ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాల నుంచి కోలుకోవడానికి అతనికి ఆరు నెలల కంటే ఎక్కువ సమయమే పట్టింది. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత అతడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్‌కి ముస్తాబవుతున్న తరుణంలో.. చిత్రబృందం అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆ యాక్సిడెంట్ రోజుల్ని సాయి తేజ్ గుర్తు చేసుకున్నాడు.
Pathaan Bikini Row: పఠాన్ బికినీ వివాదం.. ఎట్టకేలకు నోరు విప్పిన డైరెక్టర్
తాను ప్రమాదానికి గురైనప్పుడు.. తల్లిదండ్రుల దగ్గర నుంచి అభిమానుల దాకా ఎంతోమంది తాను కోలుకోవాలని ప్రార్థించారని, వారి ప్రార్థనల కారణంగానే తాను బతికి బయటపడ్డానని సాయి తేజ్ చెప్పాడు. తాను ఆర్థికంగా ఎంత సంపాదించానన్న సంగతి పక్కన పెడితే.. ప్రేక్షకుల అభిమానాన్ని సాధించగలిగానని, జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలని పేర్కొన్నాడు. అయితే.. తాను మంచాన పడినప్పుడు కొందరు నెట్టింట్లో తనని దారుణంగా ట్రోల్ చేశాడని గుర్తు చేసుకున్నారు. ఏదో జోకులు వేయాలన్న ఉద్దేశంతో.. ‘నీ పనైపోయిందా? ఇక రిటైర్‌మెంటేనా?’ అంటూ ట్రోల్ చేశారన్నాడు. అయితే ఆ ట్రోల్స్‌కి తానేమీ బాధపడటం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ ప్రమాదం కూడా తనకి ఎప్పుడూ పీడకల కాదని, ఒక స్వీట్ మెమోరీ అని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో సరైన విధంగా ఆలోచించడానికి.. ఆ ప్రమాదం ఒక మంచి గుణపాఠం కింద ఉంటుందని పేర్కొన్నాడు. భయాన్ని మించి ఎదగాలని తల్లి తనకు నేర్పిందని.. ఇప్పుడదే ఫాలో అవుతున్నానన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తన ఆలోచన విధానం పూర్తిగా మారిందని తెలిపాడు.
Celina Jaitly: వాళ్లు అడుక్కోరు.. తప్పుగా ప్రవర్తిస్తారు.. నెటిజన్‌కి సెలీనా గుణపాఠం
ఇక కెరీర్ పరంగా మాట్లాడుతూ.. తాను ఆ ప్రమాదం నుంచి కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టిందని, కోలుకున్న వెంటనే ‘విరూపాక్ష’ పనులు మొదలుపెట్టామని చెప్పాడు. ప్రస్తుతం తనకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి వినోదయ సీతమ్‌లో నటించే అవకాశం వచ్చిందని.. భవిష్యత్తులో కూడా పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవితోనూ కలిసి నటిస్తానని అన్నాడు. కాగా.. విరూపాక్ష సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల అవుతోంది. ప్రోమోలతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాతో సాయి తేజ్ సూపర్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.