Pathaan Bikini Row: పఠాన్ బికినీ వివాదం.. ఎట్టకేలకు నోరు విప్పిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth Anand Reacts On Pathaan Orange Bikini Controversy: పఠాన్ సినిమాలోని బేషరం రంగ్ పాటలో దీపికా పదుకొణె వేసుకున్న బికినీపై అప్పట్లో ఎంత దుమారం రేగిందో అందరికీ తెలుసు. ఆ దుస్తులు కాషాయం రంగులో ఉండటంతో.. హిందూ సంఘాలు సహా రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ దుస్తులున్నాయని.. ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం ఎంత ముదిరిందంటే.. సినిమానే బాయ్‌కాట్ చేయాలని నిరసన వెల్లువెత్తింది. కొన్ని చోట్లైతే.. పోస్టర్లు అతికించిన థియేటర్లపై దాడి చేశారు. సినిమా విడుదలని ఆపేయాలంటూ.. ఆయా థియేటర్లకు వెళ్లి హంగామా సృష్టించారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. ఒకవేళ ప్రమోషన్స్ నిర్వహిస్తే.. ఆ వివాదం తమ సినిమాపై ప్రభావం చూపుతుందని సైలెంట్ అయ్యారు. అనంతరం సినిమా విడుదల అవ్వడం, బాయ్‌కాట్ ట్రెండ్‌ని పట్టించుకోకుండా థియేటర్లపై ప్రేక్షకులు దండయాత్ర చేయడం, ఇది కలెక్షన్ల సునామీ సృష్టించడం జరిగింది.
Celina Jaitly: వాళ్లు అడుక్కోరు.. తప్పుగా ప్రవర్తిస్తారు.. నెటిజన్‌కి సెలీనా గుణపాఠం
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఇప్పుడెలాగో తమ సినిమా ఘనవిజయం సాధించింది కాబట్టి.. ఆ బికినీ వివాదంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందించాడు. ‘‘మేము ఆ పాటను స్పెయిన్‌లో చిత్రీకరించాలని అనుకున్నప్పుడు.. అక్కడి పరిస్థితుల్ని చూసి ఆరెంజ్ రంగు దుస్తులైతే బాగుంటుందని అనుకున్నాం. సన్నీగా వెదర్, పచ్చగా వెడ్డి, బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లూ రంగులోని వాటర్‌ని చూసి.. ఆరెంజ్ రంగు దుస్తులు వేస్తే బాగా హైలైట్ అవుతుందని భావించాం. అందుకే దుస్తులు దీపికాకి తొడిగించాం. అంతే తప్ప.. మరే దురుద్దేశంతోనో ఆ దుస్తులు వేయలేదు. ఇక ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడటం, బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు రావడం చూశాక.. బాయ్‌కాట్ ట్రెండ్ అనేది తప్పని తేలింది’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన పఠాన్ సినిమా, తొలిరోజు పాజిటివ్ టాక్‌ని మూటగట్టుకోవడంతో బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడేసుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించి.. బాహుబలి 2 రికార్డులను బద్దలుకొట్టి.. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!