Sai Dharam Tej About The Person Who Saved Him From Accident: బ్రో సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఈ క్రమంలో సినిమా చేస్తున్నప్పుడు త్రివిక్రమ్ ఏమైనా సలహాలు ఇచ్చారా? అని అడిగితే త్రివిక్రమ్ గారి లాంటి గొప్ప టెక్నీషియన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిన సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన ఏమైనా సలహాలు ఇచ్చినా కథ గురించే ఇస్తారని చెప్పుకొచ్చారు. ఇక సెట్ లో ప్రతి క్షణం మెమొరబుల్ మూమెంటే అని పేర్కొన్న ఆయన మా మావయ్యతో అన్నిరోజులు సమయం గడిపే అవకాశం లభించిందని అన్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు నన్ను సరదాగా ఆటపట్టిస్తూ ఉన్నారని అన్నారు. చిన్నప్పుడు నాతో ఎంత సరదాగా ఉండేవారో, ఇప్పటికీ నాతో అలాగే ఉన్నారని పేర్కొన్న తేజ్ చిన్నప్పుడు నేను కళ్యాణ్ మావయ్యతో ఎక్కువ సమయం గడిపేవాడిని, దాంతో తెలియకుండానే ఆయనతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని అన్నారు.
Krishna Gadu Ante Oka Range: దిల్ రాజు చేతుల మీదుగా `కృష్ణగాడు అంటే ఒక రేంజ్` ట్రైలర్ లాంచ్
పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ నాకు ఈ సినిమాకి మాత్రమే కాదు, నా మొదటి సినిమా నుంచి ఉందని పేర్కొన్న ఆయన మనం ఊపిరి పీల్చుకోవడానికి గాలి ఎలాగైతే ఉందో, ఆయన సపోర్ట్ కూడా నాకు అలాగే ఉందని అన్నారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చిన్న విరామం తీసుకోవాలి అనుకుంటున్నానని పేర్కొన్న తేజ్ నిజానికి విరూపాక్ష తర్వాతే తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇంతలో బ్రో షూటింగ్ స్టార్ట్ అయిందని అన్నారు. ఇప్పటికే చాలా మెరుగయ్యాను కానీ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మరింత దృఢంగా వస్తానని అన్నారు. ఇప్పటికే సంపత్ నంది గారి దర్శకత్వంలో ఒక సినిమా అంగీకరించానని ఆయన అన్నారు. ఇక తనని యాక్సిడెంట్ సమయంలో కాపాడిన అబ్దుల్ విషయంలో కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని తేజ్ అన్నారు. నేను అతనికి కొన్ని డబ్బులు ఇచ్చి చేతులు దులుపు కోవాలి అనుకోలేదని పేర్కొన్న ఆయన అతను నా ప్రాణాన్ని కాపాడాడు, నేను అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని చెప్పానని ఈ మధ్య కూడా అతన్ని కలిశానని అన్నారు. నా టీం అతనికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని తేజ్ చెప్పుకొచ్చారు.