Sai Dharam Tej shares first day shoot experience of bro movie: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన మూవీ ‘బ్రో’. తమిళ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూర్చగా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించగా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో యూనిట్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టగా విలేకర్లతో ముచ్చటించాడు సాయి ధరమ్ తేజ్. ఈ క్రమంలో బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తేజ్ పంచుకున్నారు. మొదటిరోజు సెట్ లో అడుగు పెట్టినప్పుడు ఎలా అనిపించింది? అని అడిగితే మొదటిరోజు కంగారు పడ్డానని, వణికిపోయానని అన్నారు.
Sai Dharam Tej: బాగా ఇబ్బంది పడ్డా.. అప్పుడే విలువ తెలిసింది!
అలాగే కేకు కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి తినిపించాల్సి వచ్చిందని అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు రెండు సార్లు టేక్స్ తీసుకోవడం జరిగిందని అన్నారు. పవన్ తనను మానిటర్ దగ్గరకు తీసుకుని వెళ్లి చూపించగా అప్పుడు చేతులు వణికిన విషయం అర్ధం అయిందని అన్నారు. ఇక కళ్యాణ్ మావయ్య పిలిచి ఎందుకురా కంగారు పడుతున్నావు, నేనే కదా అంటూ నా టెన్షన్ అంతా తీసి పక్కన పెట్టారని తేజ్ చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే సెట్ అయిపోయానని షూట్ సమయంలో సముద్రఖని గారు కూడా బాగా సపోర్ట్ చేశారని అన్నారు. కథ ఓకే అయ్యే సమయానికి నాకు యాక్సిడెంట్ జరగలేదని, అది యాదృచ్చికంగా జరిగిందని అన్నారు. టైం విషయంలో మాత్రం కనెక్ట్ అయ్యానని పేర్కొన్న తేజ్ కుటుంబంతో సమయం గడపటానికి ఇష్టపడతానని, మా అమ్మగారితో గానీ, నాన్న గారితో గానీ రోజులో ఏదొక సమయంలో కాసేపైనా గడుపుతానని అన్నారు. నా దృష్టిలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడపడం కంటే విలువైనది ఏదీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.