కోలీవుడ్ స్టార్ విశాల్ రీసెంట్గా “సామాన్యుడు” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే ఆ తరువాత డిజిటల్‌గా రంగప్రవేశం చేసిన ఈ చిత్రం మంచి వ్యూయర్షిప్ను సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటలకు ZEE తెలుగులో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
Read Also : Galla Ashok : పబ్ వివాదంతో సంబంధం లేదు !
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విశాల్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా ద్వారా తు. ప. శరవణన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే విశాల్…. యూనిక్ కంటెంట్ ఉన్న ‘సామాన్యుడు’ను తానే సొంతంగా నిర్మించడం విశేషం. డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా. తులసి, రవీనా రవి ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం విశాల్ “లాఠీ”, “తుప్పరివాలన్”, “మార్క్ ఆంటోనీ” అనే సినిమాలతో బిజీగా ఉన్నారు.