కోలీవుడ్ స్టార్ విశాల్ రీసెంట్‌గా “సామాన్యుడు” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే ఆ తరువాత డిజిటల్‌గా రంగప్రవేశం చేసిన ఈ చిత్రం మంచి వ్యూయర్‌షిప్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటలకు ZEE తెలుగులో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ఓ పోస్టర్…
తమిళ హీరో విశాల్ ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ సినిమా షూటింగ్ లో మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న సమయంలో ఆయన గోడను ఢీకొని పడిపోవడంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ సభ్యులు తెలిపారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో విశాల్ గాయపడడం ఇది రెండోసారి. ఇదివరకు…