విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పామ్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకూండా భారీ అంచనాలను రేకెత్తించేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగాయని టాక్ నడుస్తోంది. లైగర్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయాయని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లైగర్ ని రూ. 60 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందంట. అంటే పుష్ప ని మించి లైగర్ బిజినెస్ జరిగింది. పుష్ప డిజిటల్ హక్కులను అమెజాన్ రూ. 30 కోట్లు వెచ్చింది సొంతం చేసుకోగా.. దానికి డబుల్ రేట్ ని లైగర్ కి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కేవలం ఓటీటీ ద్వారానే సినిమా ఈ స్థాయిలో ఆఫర్ ను అందుకుంది అంటే ఇంకా శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా ఏ స్థాయిలో లాభాలు అందుకుంటుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. క్రేజి కాంబినేషన్, రౌడీ హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ అంత మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 25 ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో రౌడీ హీరో పా ఇండియా హీరోగా మారతాడా..? మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడా ..? అనేది చూడాలి