యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. అంతేకాకుండా సినిమా రన్‌టైమ్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. సినిమా మొత్తంగా 150 నిమిషాలు ఉన్నట్టుగా సెన్సార్ సర్టిఫికెట్ లో ఉంది. అంటే 2 గంటల 30 నిముషాలు అన్నమాట. ఇక సినిమా విడుదలకు మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్.
Read Also : Pawan Kalyan : ఖరీదైన ప్లాట్ కొన్న పవర్ స్టార్ ?
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే ప్రెస్ మీట్లతో బిజీగా ఉన్నారు. ఇక యువి క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాలో మురళీ శర్మ, భాగ్యశ్రీ, జగపతి బాబు, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సోల్ ఫుల్ సాంగ్స్ కంపోజ్ చేయగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి థమన్ బాధ్యత తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాను వెండితెరపై చూసి థ్రిల్ అవ్వడానికి రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
