Rules Ranjan: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రూల్స్ రంజన్. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లావనియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ప్రే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కొన్ని సినిమాలు మ్యూజిక్ మంచి హిట్ అందుకున్న కూడా కథ బాగోకపోతే అభిమానులు సినిమాను ఎంకరేజ్ చేయరు అన్న విషయం చాలా సినిమాల్లో రుజువు అయింది. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేస్తే తప్ప ఈ మధ్యకాలంలో సినిమా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లడం లేదు. ఇంకోపక్క మొదటినుంచి కూడా కిరణ్ అబ్బవరం పై చాలామంది నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమాతో కిరణ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత అతనిపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు అభిమానులు.
Depression: డిప్రెషన్ తో చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకున్న తారలు వీరే..
ఇక రూల్స్ రంజన్ కూడా టీజర్, సాంగ్స్ మంచి విజయాన్ని అందుకోవడంతో సినిమాపై ప్రేక్షకులు మంచి పాజిటివ్ టాక్ తోనే ఉన్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ విషయంలో కిరణ్ స్పీడ్ పెంచాలని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాపై బజ్ లేదు. ఇప్పటినుంచి అయినా ప్రమోషన్స్ పై దృష్టి పెడితే సినిమా రిలీజ్పె అయ్యేసరికి బజ్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఎలాగూ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు.. అదొక్కటే సరిపోదు కాబట్టి ప్రమోషన్స్ కూడా బాగా పెంచాలని అభిమానులు సలహాలు ఇస్తున్నారు. మరి ఇకనుంచి అయినా కిరణ్.. ప్రమోషన్స్ షురూ చేసి.. మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.