లాస్ ఏంజిల్స్ లో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న మ్యాగజైన్ ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ మన ఇండియన్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ గురించి స్పెషల్ ఆర్టికల్ ని మెయిన్ పేజ్ లో ప్రచురించింది. “The Heroes of The’Woods” అనే హెడ్డింగ్ పెట్టి ఒక ఫుల్ పేజ్ లో చరణ్-ఎన్టీఆర్ గురించి రాశారు. దీన్ని షేర్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ మూవీ అఫీషియల్ ట్విట్టర్ లో ఒక ఫోటోని పోస్ట్ చేశారు. మ్యాగజైన్ లో పడిన ఫోటోనే ఫుల్ HDలో రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో చరణ్, ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఫుల్ గడ్డంతో రఫ్ గా కనిపిస్తే, చరణ్ గాగుల్స్ పెట్టుకోని మోడరన్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ఎంత స్టైలిష్ గా ఉన్నా ఈ ఇద్దరు హీరోలు మాస్ గానే కనిపిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ అంటే వాటర్, చరణ్ అంటే ఫైర్ అనే మెటాఫర్ ని వాడారు. దీనికి రివర్స్ లో ఉంది తాజాగా పోస్ట్ చేసిన ఫోటో, చరణ్ బ్లూ బ్యాక్ గ్రౌండ్ లో ఉండగా ఎన్టీఆర్ రెడ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం చరణ్-ఎన్టీఆర్ ల కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ ఇండియన్ సినిమాకి రానంత రీచ్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చరణ్ మరియు ఎన్టీఆర్ లకి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ తెచ్చింది. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ లు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఆడియన్స్ వాళ్లని గుర్తు పడతారు. ఇలాంటి హైప్ ఉన్న సమయంలో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ 2 సినిమా అనౌన్స్ చేస్తే సినిమా ప్రపంచమే షేక్ అయిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ 2 ఉంటుంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని చెప్పిన రాజమౌళి… ఒకేవేల ఏదైనా కేటగిరిలో ఆస్కార్ గెలిస్తే, ఇమ్మిడియేట్ గా జక్కన ఆర్ ఆర్ ఆర్ 2 పనులు మొదలుపెడితే అనౌన్స్మెంట్ తోనే వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. మరి రాజమౌళి ఆ సైడ్ థింక్ చేస్తాడేమో చూడాలి.
HEROES OF THE’WOODS 💥💥💥💥
Featured on @latimes ❤️🔥 pic.twitter.com/FHKGfXRxCn
— RRR Movie (@RRRMovie) January 17, 2023
heRRRoes!! ❤️🔥❤️🔥 pic.twitter.com/9f2pQ3oI6c
— RRR Movie (@RRRMovie) January 17, 2023