మోస్ట్ అవైటెడ్ మూవీ “ఆర్ఆర్ఆర్” సినిమా నుంచి రాజమౌళి విడుదల చేస్తానని చెప్పిన గ్లింప్స్ వచ్చేసింది. యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. గ్రాండ్ విజువల్స్ తో భారీ యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ గా విడుదలైన “ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ 45 సెకన్ల వీడియోలో సన్నివేశాలు అద్భుతమని చెప్పాలి. భారీ యాక్షన్‌తో నిండిన గ్రాండ్ విజువల్స్ కట్టిపడేస్తున్నాయి. నటీనటులు భావోద్వేగాలను ప్రదర్శించిన విధానం హైలెట్. ఇక ఈ వీడియోలో కన్పిస్తున్న భారీ సెట్స్‌తో పాటు సినిమా కోసం వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులను ఉపయోగించడం మరో ఆసక్తికర విషయం. ఎప్పటి నుంచో ఈ గ్లింప్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు.
ఈ ఒక్క టీజర్ చాలు సినిమాపై అంచనాలను మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి. అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్… ఇలా సినిమాలోని ప్రతి ముఖ్యమైన పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేశారు. మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్… ఒక్క డైలాగ్ కూడా లేకుండానే సైలెంట్ గా కేవలం లుక్స్ తోనే మనసుని తాకే భావోద్వేగాల్ని పలికించారు నటీనటులు. టీజర్ లో మరో కీలకమైన అంశం ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది వీడియోలో సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేస్తుంది.
Read Also : నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు
జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లతో పాటు, బాలీవుడ్ నటి అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ అద్భుతాన్ని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా ? అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.