Kiraak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు.. జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ ఈ కర్రీ పాయింట్ పెట్టినప్పటినుంచి మరింత ఫేమస్ అయ్యాడు. అసలు తమవద్ద దొరికే చేపల పులుసు కోసం జనం కొట్టుకుంటున్నారని, వారు తోసుకోకుండా ఉండడానికి బౌన్సర్లను కూడా పెట్టాడు ఆర్పీ. తన బిజినెస్ ను తొక్కేయ్యడానికి చాలామంది ట్రై చేస్తున్నారని చెప్పినా ఆర్పీ మూడు నెలలు కాకముందే కర్రీ పాయింట్ ను క్లోజ్ చేశాడు. అయితే అందుకు కారణం.. చెఫ్స్ తక్కువగా ఉండడటంతో కస్టమర్లకు సరైన టైమ్ లో అందివ్వలేకపోతున్నామని, ఈసారి పెద్ద స్థలంలో పెద్ద కర్రీ పాయింట్ తో వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చాకా.. ఆ షో పై నెగెటివ్ కామెంట్స్ చేసినవారెవరైనా ఉన్నారంటే అది కిర్రాక్ ఆర్పీ మాత్రమే. ఫుడ్ బాగోలేదని, ఆ ఫుడ్ ను అడుక్కునే వాళ్లు కూడా తినలేరని చెప్పుకొచ్చారు. ఇక ఆర్పీ మాటలపై జబర్దస్త్ నటులు ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరో జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ సైతం ఆర్పీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Samantha: అక్కడ రూ. 15 కోట్లతో ప్లాట్ కొన్న సామ్.. హైదరాబాద్ కు దూరమవుతుందా..?
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకింగ్ రాకేష్ కు కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన కిర్రాక్ ఆర్పీ.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ తో మరింత ఫేమస్ అయ్యాడు.. దీనికి కారణం జబర్దస్త్ అనే అంటారా..? అన్న ప్రశ్నకు రాకేష్ మాట్లాడుతూ.. “ఖచ్చితంగా.. అది జబర్దస్త్ పెట్టిన భిక్ష. అక్కడ చేసిన నటులెవ్వరికైనా ఇది వర్తిస్తోంది.. ఏది చేసినా.. ఎంతగుర్తింపు తెచ్చుకున్నా.. అదంతా ఆ షో పెట్టిన భిక్షనే” అని చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పుడైనా మీరు ఆర్పీని కలిశారా..? అని అడుగగా.. రాకేష్ గట్టి కౌంటర్ వేశాడు. ” దేవుడి దయవలన అంత పెద్దవారిని కలిసే అదృష్టం నాకు రాలేదు.. మేము చాలా చిన్న ఆర్టిస్టులం” అంటూ వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అలాంటివారి గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్ అని, అతని గురించి మాట్లాడం ఆపేయమని యాంకర్ కు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.