Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న ఈ భామ కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడం మొదలుపెట్టింది. అక్కినేని ఇంటి కోడలిగా ప్రేమించిన చైతన్యను పెళ్ళాడి ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సామ్ నాలుగేళ్లకే భర్త నుంచి విడిపోయి ఒంటరిగా మిగిలింది. ఇక ఆ జ్ఞాపకాలనుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సామ్ ముంబైకు మకాం మారుస్తుందని వార్తలు వస్తున్నాయి. సామ్ విడాకులు తీసుకున్నప్పుడు కూడా ఈ రూమర్స్ వచ్చాయి. అయితే అప్పుడు సామ్ హైదరాబాద్ తన సొంత ఇల్లు వంటిదని, ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పుకొచ్చింది. దీంతో అప్పట్లో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి ఆ రూమర్స్ గుప్పుమన్నాయి.
Vijay Setupathi: నన్ను అలా పిలవొద్దని చెప్పా.. విజయ్ సీరియస్ వార్నింగ్
ప్రస్తుతం సామ్ ఫోకస్ అంతా బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై పెట్టిందని, ప్రతిసారి హైదరాబాద్ టూ ముంబై తిరగడం కష్టంగా ఉండడంతో అక్కడే ఆమె ఒక ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఆ ప్లాట్ విలువ రూ. 15 కోట్లని టాక్. మంచి విలాసవంతమైన రూమ్స్ తో సకల సౌకర్యాలతో ఉన్న ఈ ఇంటిని సామ్ తన టేస్ట్ కు తగ్గట్టు డిజైన్ చేయించుకుందట. త్వరలోనే హైదరాబాద్ నుంచి ముంబైకు మకాం మార్చే పనిలో ఉందని తెలుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కనై, ఈ విషయం తెలియడంతో అభిమానులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామ్.. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై సామ్ ఏమైనా స్పందిస్తుందోమో చూడాలి.