టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల అని ఆ మధ్య అధికారకంగా ప్రకటన కూడా చేసారు మేకర్స్.
Also Read : AlluArjun : బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు అంతా రెడీ..
కానీ వివిధ రకాల కారణాల వలన ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. ఆ తర్వాత సంక్రాంతికి తీసుకురావాలని హీరో పట్టుబట్టాడు కానీ అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించక విడుదల కాలేదు. తాజగా రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది సమ్మర్ కానుకగా మర్చి 28న వరల్డ్ వైడ్ గా రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అదే రోజున నితిన్ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ నుండి వస్తున్నా సినిమా ఇది. ఈ విషయం తెలిసే నితిన్ సినిమా డేట్ వేసారా లేదా పవన్ సినిమా ఆ డేట్ కు రాదనే నమ్మకంతో వేసారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.