RGV : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటంతో టాలీవుడ్ లో చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో ఆర్జీవీ ఏమన్నాడంటే.. నాకు అసలు దేవుళ్లు అంటే నమ్మకం లేదు. అందుకే నేను దేవుడు, భక్తులను ఇష్టపడను. కానీ తిన్నడు కన్నప్పగా మారే తీరును విష్ణు మూవీలో అద్భుతంగా చూపించాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.
Read Also : Prabhas : ఆ కోటలో అడుగు పెడుతున్న ప్రభాస్.. ఎందుకంటే..!
క్లైమాక్స్‌లో శివలింగం నుండి రక్తస్రావం ఆపడానికి తిన్నడు తన కళ్లను అందించే సీన్ లో విష్ణు పర్ఫార్మెన్స్ చూసి నాకు అద్భుతంగా అనిపించింది. ఒక నాస్తికుడిగా ఇది నాకు నచ్చదు. కానీ మీ నటనతో నన్ను ఈ సీన్ లో మునిగిపోయేలా చేశారు. ఈ సినిమాలో అందరూ ప్రభాస్ ను చూడటానికి వెళ్తున్నారు. కానీ నేను మాత్రం విష్ణును చూడటానికే వెళ్తున్నా అని రాసుకొచ్చాడు ఆర్జీవీ.
దానికి విష్ణు కూడా రిప్లై ఇచ్చాడు. ఇలాంటి మెసేజ్ రావడం అంటే నా కల నిజమైనట్టే. మీ ప్రేమకు నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా. ఈ మెసేజ్ నాకు ఎంతో విలువైనది అంటూ రిప్లై ఇచ్చాడు మంచు విష్ణు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా ఆర్జీవీ ఇలాంటి మెసేజ్ కూడా చేస్తాడా అంటూ స్టన్ అవుతున్నారు.
Read Also : The Paradise: ధగడ్ పని మొదలెట్టాడు!
This text message is like a dream come true for the actor in me. 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/cB4CEjcmGo
— Vishnu Manchu (@iVishnuManchu) June 28, 2025