Revanth Reddy: నేను కృష్ణ అభిమానిని.. లారీ ఎక్కి వెళ్లి సినిమాలు చూసే వాడిని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అది సమాజాన్ని ప్రభావితం చేసే ఒక గొప్ప శక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అల్లు కుటుంబం చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సినిమా రంగాన్ని ఐటీ మరియు ఫార్మా రంగాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాను స్వతహాగా సినిమా అభిమానినని చెప్పుకున్న సీఎం, గతంలో వనపర్తిలో లారీ ఎక్కి వెళ్లి సినిమాలు చూసిన రోజులను గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో కృష్ణ గారు ఏడాదికి 15 సినిమాలు చేసేవారు, నేను ఆయనకు పెద్ద అభిమానిని. కానీ నేడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఒక్కో సినిమాకు ఐదారేళ్లు సమయం పడుతోంది” అని ప్రస్తుత నిర్మాణ శైలిని విశ్లేషించారు.
Also Read :Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
Also Read
- Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్‌లైన్?
- Aditya Dhar: 'నువ్వు నా నటుడివి కాదు.. నా బ్రదర్‌వి': రణ్వీర్ సింగ్‌పై 'ధురంధర్' డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
- Theatrical Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సౌత్ సినిమాలు..
- Pan-India Film: ఆల్మోస్ట్ ఫిక్స్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్!
తెలుగు సినిమా మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలి రావడంలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన కృషిని ఆయన కొనియాడారు. కృష్ణ గారు తెలుగు సినిమాల్లో చేసిన సాహసాలు పరిశ్రమను మలుపు తిప్పాయని గుర్తు చేశారు. నేడు భాషా అడ్డంకులు తొలగిపోయాయని, కేవలం టాలెంట్ మాత్రమే కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బాహుబలి, కల్కి, అరుంధతి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాయి. తెలుగు సినిమాకు ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ పోటీ కాదని.. మన లక్ష్యం హాలీవుడ్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశీ చిత్రాలు సైతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకునే స్థాయికి మన మౌలిక సదుపాయాలు పెరగాలని ఆకాంక్షించారు. కృష్ణా నగర్ వంటి ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులు వస్తున్నారని, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సినిమాను ఒక పరిశ్రమగా గుర్తించి, ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Suicide on Video Call : వీడియో కాల్‌లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
-
PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్‌కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
-
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
-
Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
-
Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!