Aditya Dhar: ‘నువ్వు నా హీరోవి కాదు.. నా బ్రదర్‌వి’: రణ్వీర్ సింగ్‌పై ‘ధురంధర్’ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya Dhar: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ బర్త్‌డే సందర్భంగా ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. రణ్వీర్ సింగ్ కేవలం అసాధారణమైన నటుడు మాత్రమే కాదు, అంతకంటే గొప్ప మానవతావాది అని ఆయన కొనియాడారు. ‘ధురంధర్’ సినిమా తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమని చెబుతూ.. షూటింగ్ సెట్స్‌లో రణ్వీర్ చూపించిన నటనా విశ్వరూపాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
భారతీయ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్!
“కొన్ని సినిమాలు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి. నా కెరీర్లో ‘ధురంధర్’ అలాంటి చిత్రమే. రణ్వీర్ ఒక అద్భుతమైన నటుడని నాకు ముందే తెలుసు. కానీ ఈ సినిమా జర్నీలో ఆయనలోని నటుడితో, అతని వ్యక్తిత్వంతో నేను ప్రేమలో పడ్డాను. ఈ సినిమాలో రణ్వీర్ చేసిన నటన భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిపోతుంది. అది కేవలం నటన కాదు.. ఒక ప్రవాహం” అంటూ ఆదిత్య ధర్ రణ్వీర్ సింగ్‌ను కొనియాడారు. ధురంధర్ సినిమాలోని కొన్ని కీలకమైన సీన్లను ప్రస్తావిస్తూ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ముఖ్యంగా 26/11 సీక్వెన్స్, క్లైమాక్స్ టీ షాప్ సీన్, పఠాన్‌కోట్ మారణహోమం, పంప్ హౌస్ సీన్, కోర్టు ఎక్స్టీరియర్ సీన్స్ చేస్తున్నప్పుడు.. చాలా అరుదైన నటనను నేను కళ్లారా చూశాను. ఏ ఒక్క సీన్లోనూ రణ్వీర్ ఈజీ ఆప్షన్ తీసుకోలేదు. ప్రతి ఎమోషన్, ప్రతి సైలెన్స్ పర్ఫెక్ట్గా పండాయి. ఆ కన్సిస్టెన్సీ చూస్తుంటే.. సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవి తన చేతిని రణ్వీర్ తలపై పెట్టి దీవించిందా? అన్నట్లు అనిపించింది. ఒక దర్శకుడిగా నా కెరీర్ మొత్తం ఇలాంటి క్షణాల కోసమే ఎదురుచూశాను” అని పేర్కొన్నారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
షూటింగ్ సమయంలో తమ ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం గురించి చెబుతూ.. “యాక్షన్, కట్ మధ్య జరిగిన సంభాషణలు, ప్రతి సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం పడిన తపన నా హృదయానికి దగ్గరయ్యాయి. ఆ ప్రయాణంలో రణ్వీర్ కేవలం నా హీరోగానే మిగిలిపోలేదు.. నా సొంత బ్రదర్‌గా మారిపోయాడు. నా హృదయాన్ని, నా క్రాఫ్ట్‌ను, నాలోని పిచ్చిని నమ్మి నిన్ను నా చేతుల్లో పెట్టినందుకు థాంక్యూ బ్రదర్. మనం కలిసి సృష్టించిన ఈ సినిమాను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే మై బ్రదర్.. లవ్ యూ ఆల్వేస్” అంటూ ఆదిత్య ధర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ నోట్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
Happy Birthday, Ranveer Singh. ❤️
Some films stay with you forever. Dhurandhar will always be one of those films for me. Not just because of the story we told but because I got to witness something very few directors ever get to witness.
I’ve always known you’re an extraordinary… pic.twitter.com/Nuj5RTielg— Aditya Dhar (@AdityaDharFilms) July 6, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!