Renu Desai in Tiger Nageswara Rao: రేణు దేశాయ్, కెరీర్లో చేసింది మూడే మూడు సినిమాలు. బద్రి, జానీ సినిమాలు తెలుగులో చేస్తే జేమ్స్ పండు అనే సినిమా తమిళంలో చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సహజీవనం, వివాహం, విడాకులు అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చిన ఆమె టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీయంట్రి ఇస్తుంది అనే వార్త విన్నప్పటి నుంచి ఆమె అభిమానులు మాత్రమే కాదు పవన్ అభిమానులు సైతం ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయం మీద చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఈ టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ సమయంలో కూడా రేణు దేశాయ్ చాలా ఎమోషనల్ అయింది. తాను పోషించిన హేమలత లవణం పాత్ర తనకు జీవితాంతం గుర్తుండి పోతుంది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన జీవితంలో ఏదైనా పెద్ద రిగ్రెట్ ఏదైనా ఉంది అంటే అది హేమలత లవణంను బతికుండగా కలవలేక పోవడమే అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఇంత చెబుతుందంటే ఈ పాత్ర ఒక రేంజ్ లో ఉంటుందని ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకున్నారు కానీ సినిమా చూస్తే మాత్రం రేణు దేశాయ్ చెప్పినంత అక్కడ ఏమీ కనిపించలేదు.
Bhagavanth Kesari : కాజల్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆమెకే.. ఎవరెంత తీసుకున్నారంటే?
వాస్తవానికి సినిమాలో ఆమెది కీలకమైన పాత్ర అయినా సొంత డబ్బింగ్ కాకపోవడం, ఆ పాత్రలో పెద్ద వయసు వ్యక్తిగా కనిపించడంతో రేణు దేశాయ్ ఈ పాత్రకు సూటబుల్ కాదేమో అనిపించేలా సాగింది. అంటే అలా అని ఎవరు చేసినా సినిమా మీద ఇంపాక్ట్ మారేది కాదనుకోండి. అంతేకాక హేమలత లవణం కాస్త సన్నగానే ఉంటారు కానీ ఈ పాత్రలో రేణు దేశాయ్ మాత్రం కాస్త బొద్దుగా కనిపించడం అసలు ఆ పాత్రకు ఆమె సూట్ అవ్వలేదు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో పాత్ర గురించి రేణు దేశాయ్ చాలా చెప్పింది కానీ ఆవిడ చెప్పినంత లేదే అంటూ పెదవి విరుస్తున్నారు. నిజానికి సర్కారు వారి పాటలో నదియా చేసిన బ్యాంకు అధికారి పాత్ర తాను చేయాల్సిన పాత్ర అని కొన్ని కారణాలతో చేయలేకపోయానని తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ వెల్లడించింది .. ఆ కారణాలు చెబితే అనవసరమైన కాంట్రావర్సీలు అంటూ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ రీ ఎంట్రీ సినిమాగా చెబుతున్న టైగర్ నాగేశ్వరరావు రేణు దేశాయ్ కెరియర్ కి ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్దగా ఉపయోగపడదేమో అని కామెంట్లు వినిపిస్తున్నాయి.