Similarities Between Bhagavanth Kesari and Leo Movies: నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో అనే సినిమా కూడా రిలీజ్ అయింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్,అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, గౌతం మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా కూడా బాలయ్య సినిమాతో పోటీ పడుతూ అదే రోజున అంటే అక్టోబర్ 19న రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ రెండు సినిమాల మధ్య పేరుతో సహా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.
Tiger Nageswara Rao Movie Review: టైగర్ నాగేశ్వరరావు రివ్యూ
1)ముందుగా ఈ సినిమాల పేర్లు చూస్తే బాలకృష్ణ సినిమాకి భగవంత్ కేసరి అనే టైటిల్ ఉంది. ఇందులో కేసరి అంటే సింహం అని అర్థం. ఇక అదే సమయంలో విజయ్ సినిమాకి లియో అనే టైటిల్ పెట్టగా దానికి కూడా సింహం అనే అర్థం వస్తుంది.
స్పాయిలర్స్ అలెర్ట్) ఈ సినిమా చూసి మాత్రమే ఎంజాయ్ చేయాలి అనుకునేవారు ఈ ఆర్టికల్ స్కిప్ చేయండి.
2)ఇక రెండో కామన్ పాయింట్ ఏమిటి అంటే? బాలకృష్ణ సినిమాలో విలన్ అర్జున్ రాంపాల్ తన బిజినెస్ ను కాపాడుకోవడం కోసం కన్న కొడుకును ఎలాంటి జాలి దయ లేకుండా చంపేస్తాడు. ఇక లియో సినిమాలో కూడా దాదాపుగా ఇదే పాయింట్ రిపీట్ అవుతుంది. కానీ కొడుకు తృటిలో తప్పించుకుని తన తండ్రికి బుద్ధి చెప్పి వినకపోవడంతో చంపేస్తాడు.
3)మూడవ కామన్ పాయింట్ ఏమిటంటే రెండు సినిమాల్లో హీరోలు తమ కుటుంబం కోసం ఏమీ చేయడానికి అయినా సిద్దపడేవారిలా కనిపిస్తారు.
4)నాలుగో కామన్ పాయింట్ ఏమిటంటే ఈ రెండు సినిమాల్లో హీరోలు ఇద్దరూ తమ తమ వయసుకు తగ్గ పాత్రలలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్ లో అదరగొట్టారు.
5)ఇక సినిమాలో మరో కామెంట్ పాయింట్ ఏంటంటే పాటల సంగతి ఎలా ఉన్న సంగీత దర్శకులు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అడఅదరకొట్టారు. ఇద్దరి హీరోలకు మ్యూజిక్ డైరెక్టర్ల తో మంచి బాండింగ్ కూడా ఉంది.