Razakar Poster Launch: హైదరాబాద్ లో అప్పటి ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలను కళ్ళకి కట్టినట్టు చూపేలా రజాకర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో చరిత్రను చూపిస్తున్నామని చెబుతున్నా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. అయితే రజాకార్ల అంశం అనేది తెలంగాణలోని చాలా మంది భావోద్వేగాలకు ముడిపడిన అంశమనే చెప్పాలి. ఈ రజాకర్ అనే సినిమా కోసం దర్శకుడు యాట సత్యనారాయణ 1946 నాటి గ్రామాన్ని పునఃసృష్టించడం గమనార్హం. సెట్లో మొత్తం 19 షెడ్యూల్స్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. 1947 ముందు తెలంగాణ గడ్డ పై రజాకార్ల దురగాథల వల్ల సాధారణ ప్రజలు ఎన్నో కష్టాలు, బాధలు పడగా వాటిని ప్రాధాన ఇతివృత్తాంతంగా తీసుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
Samantha party: వాళ్ళందరికీ సమంత స్పెషల్ పార్టీ.. ఎందుకంటే?
అదలా ఉంచితే తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని జలవిహార్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖులతో పాటు ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ విద్యసాగర్, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటి వారు హాజరయ్యారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాటలు రాస్తున్న అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ వేదిక మీద సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ “రజాకర్ లాంటి సినిమా తియ్యాలంటే చాలా గట్స్ ఉండాలని అన్నారు. మా అమ్మ నాన్న ఇద్దరు స్వతంత్ర సమరయోధులే, వారి బిడ్డగా నాకు ఈ సినిమాలో పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అయితే రజాకర్ అంటే వలంటీర్ అనే అర్థం వస్తుంది కానీ వాళ్లు చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు, ఇది మతపరమైన సినిమా కాదు. ఏ ఒక్కరికి ఇది వెతిరేకమైనది కాదని అన్నారు. ఇక సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.