Samantha farewell party: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన సమంతకు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. దానికి తోడు ఆమె మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడటంతో గత కొన్నాళ్లుగా ఆమె ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సినిమా షూటింగులు పూర్తి చేసి ఆమె అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక ఏడాది రెస్టు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖుషి అలాగే సిటాడెల్ ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్స్ పూర్తి చేసుకున్న ఆమె త్వరలోనే అమెరికా పయనం అవ్వబోతోంది. ఇక వెళ్లే ముందు తన స్నేహితులకు, తన టీం అలాగే తన కోసం పనిచేసే వాళ్ళందరికీ ఒక ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అంటే ఏదో లంచ్ కో డిన్నర్ కో పిలిచి వారందరితో సమయం వెచ్చించడం కాకుండా వారందరితో రెండు మూడు రోజులు వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.
నిజానికి మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పడిన తర్వాత సమంత ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నిజానికి హైదరాబాద్ సహా భారతదేశంలో పలుచోట్ల ఆమె ఈ వ్యాధి కోసం ట్రీట్మెంట్ తీసుకుంది కానీ పూర్తిస్థాయిలో మాత్రం కోలుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ల సలహా మేరకు అమెరికా వెళ్లి అక్కడ మంచి ట్రీట్మెంట్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే చేస్తున్న సినిమా షూటింగ్స్ పూర్తి చేసి ఆమె అమెరికా బయలుదేరుతుంది. అలాగే ఇప్పటికే తీసుకున్న కొన్ని అడ్వాన్స్లు సైతం ఆమె తిరిగిచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాను అమెరికా నుంచి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా మీ ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఆమె సదరు నిర్మాతలకు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.