Razakar Poster Launch: హైదరాబాద్ లో అప్పటి ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలను కళ్ళకి కట్టినట్టు చూపేలా రజాకర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో చరిత్రను చూపిస్తున్నామని చెబుతున్నా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. అయితే రజాకార్ల అంశం అనేది తెలంగాణలోని చాలా మంది భావోద్వేగాలకు ముడిపడిన అంశమనే చెప్పాలి. ఈ రజాకర్ అనే సినిమా కోసం దర్శకుడు యాట సత్యనారాయణ 1946 నాటి గ్రామాన్ని…