మాస్ మహారాజ రవితేజ లైన్ లో పెట్టిన వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. “రామారావు ఆన్ డ్యూటీ” 2022 మార్చి 25న వెండి తెరపైకి రానుంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే తాజాగా రవితేజ చేసిన ఓ పనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Read Also : Bigg Boss Nonstop : నాగ్ కి బిగ్ బాస్ పంచ్… దడలాడిస్తున్న కొత్త ప్రోమో
రవితేజ తాజాగా తన పేరును మార్చుకున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ లో రవితేజ కొత్త పేరు పెట్టుకున్నారు. ‘రవితేజ ఆన్ డ్యూటీ’ అంటూ రవితేజ మార్చుకున్న పేరుకు సంబంధించిన ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ స్క్రీన్ షాట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కేవలం రవితేజ మాత్రమే కాకుండా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీం మొత్తం ఇలాగే పేర్లు మార్చుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే మాస్ మహారాజ ఇలా పేరు మార్చుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రస్తుతం రవితేజ ‘ధమాకా’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.