Raviteja hiked his remuneration again: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగ ప్రవేశం చేసిన రవితేజ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన చరిత్ర సృష్టించుకున్నాడు. ఈ రోజుకి కూడా మాస్ సినిమాలంటే ముందుగా గుర్తు వచ్చేది రవితేజ పేరే. మాస్ ‘మహారాజా’గా తెలుగు ప్రేక్షకులు అందరి మనసుల్లో సుస్థిర సంస్థానం సంపాదించుకున్న ఆయన ఈ మధ్యకాలంలో సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించకపోవడంతో అనేక డిజాస్టర్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2021 లో క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన ఆయన తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో డిజాస్టర్లు అందుకున్నాడు.
Also Read: Mrunal Thakur: బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘సీత’.. ఈసారి దేవరకొండతో!
ఆ తర్వాత ధమాకా సినిమా సూపర్ హిట్ అయింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఆయన చివరిగా చేసిన రావణాసుర సినిమా మాత్రం ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అడ్వకేట్ రవీంద్ర పాత్రలో రవితేజ మెప్పించాడు కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా సరే రవితేజ మరోసారి తన రెమ్యునరేషన్ పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా హిట్, ఫ్లాప్ అనే విషయాలు పక్కన పెడితే రవితేజ తన మార్కెట్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న టాలీవుడ్ వర్గాల ప్రచారం మేరకు రవితేజ తన రెమ్యునరేషన్ మళ్ళీ పెంచాడని, ఇప్పుడు దాదాపు 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది.
Also Read: Sriya Reddy: పవన్ ఓజీలో విశాల్ రెడ్డి వదిన.. పవర్ ఫుల్ అంటూ ట్వీట్
అయితే రవితేజ ఇట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టారు. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాటు ఈగల్ అనే సినిమాలో కూడా ఆయన హీరోగా నటిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అందుకు సంబంధించిన ప్రయత్నాలు అయితే ఇంకా మొదలు కాలేదు. అన్నట్టు ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు.తన రవితేజ టీం వర్క్స్ బ్యానర్ మీద ఇప్పటికీ మట్టి కుస్తీ అనే సినిమాని తెలుగులో ఆయన నిర్మించగా, రావణాసుర సినిమాలో కూడా సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు మరో హీరో హీరోయిన్ ని పెట్టి చాంగురే బంగారు రాజా అనే సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.