Rashmika: ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమాతోనే అందరి అటెన్షన్ అందుకున్న ఈ చిన్నది.. రెండో సినిమా గీతగోవిందంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండతో లిప్ లాక్ ఇచ్చి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ సినిమా అమ్మడి జీవితాన్ని మార్చేసింది. వరుస అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. ఇంకోపక్క విజయ్ తో రిలేషన్ లో ఉందని ఆమె ఎంగేజ్ మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత ఈ జంట.. చాలాసార్లు మీడియా ముందు కనిపించారు. కొన్నిసార్లు పబ్లిక్ ఈవెంట్స్ లో.. మరికొన్నీ సార్లు ప్రైవేట్ గా.. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అభిమానులు అంటుండగా.. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఏం లేదని ఈ జంట చెప్పుకొస్తున్నారు. ఇక మీడియా ముందు ఈ జంట .. ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఇంకొకరు ఎక్కడ అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. తాజాగా రష్మికకు మరోసారి ఆ ప్రశ్న ఎదురయ్యింది.
వీడీ కుటుంబానికి రష్మిక ఎంత క్లోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వాళ్ళింట్లో ప్రత్యేక పూజలకు, పండుగలకు ఆమె రావాల్సిందే. చిన్న దేవరకొండతో కూడా రష్మిక మంచి స్నేహాన్నే మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మొదటి సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో అందరికి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను రష్మిక రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రౌడీ ఫ్యాన్స్.. రచ్చ రచ్చచేశారు. రష్మిక మాట్లాడుతున్న సమయంలో.. వదినా .. అన్న ఎక్కడ అంటూ కేకలు వేశారు. ఇక అంతా రౌడీ ఫ్యాన్స్ కేకేలు పెడుతున్నా.. రష్మిక విసుక్కోవడం పక్కనపెడితే ..ముసిముసి నవ్వులు నవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక రష్మిక పరిస్థితిని అర్డం చేసుకున్న ఆనంద్ దేవరకొండ.. అన్న.. రాజమండ్రిలో ఉన్నాడు అని చెప్పి అభిమానులను శాంతపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.