Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవల కాలంలో ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. అమితాబ్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన గుడ్ బై సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక సినిమా విషయాలతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకొంది. గీతా గోవిందం చిత్రం నుంచి రష్మిక, హీరో విజయ్ దేవరకొండ మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని వారు చెప్పుకొచ్చినా పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇక డియర్ కామ్రేడ్ చిత్రంలో ఈ జంట లిప్ లాక్ అప్పట్లో పెను సంచలనాన్నే సృష్టించింది.
ఇక తాజగా ఆ విషయమై రష్మిక నోరువిప్పింది. ఆ లిప్ లాక్ పై వచ్చిన విమర్శలు, ట్రోల్స్ ను తాను తీసుకోలేకపోయాన్ని ఎమోషనల్ అయ్యింది. “ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. డియర్ కామ్రేడ్ లో విజయ్ తో లిప్ లాక్.. కథ డిమాండ్ చేయడంతో పెట్టాల్సివచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి అందరూ నన్ను విమర్శిస్తూ, ట్రోల్స్ చేస్తుంటే తట్టుకోలేకపోయా.. ఎన్నో నిద్రలేని రోజులు అనుభవించాను. చాలామంది నాకు ఫోన్ చేసి అంతా సర్దుకుంటుంది అని చెప్పారు. మరి కొంతమంది ఇలా చేయకుండా ఉండాల్సింది అని విమర్శించారు. నేను చాలా సెన్సిటివ్ పర్సన్ ను.. ఆ మాటలను తీసుకోలేకపోయా..” అని చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత కొద్దికొద్దిగా తనను తాను సంబాళించుకొని వాటిని పట్టించుకోవడం మానేశాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.