నేషనల్ క్రష్ రష్మిక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జట్ తో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. పుష్ప 2, అనిమల్ సినిమాలతో రష్మిక రేంజ్ మరింత పెరగనుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న రష్మిక మందన్న ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు చూస్తుంది. మంచి కథ దొరికితే ఫీమేల్ లీడ్ ప్లే చేయడానికి రష్మిక వెనకాడట్లేదు. ఇప్పటికే రెయిన్బో అనే సినిమాతో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేస్తున్న రష్మిక… లేటెస్ట్ గా మరో ఫీమేల్ సెంట్రిక్ సినిమాని చేస్తోంది. చి లా సౌ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్, రష్మికని హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తున్నాడు. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత నాగార్జునతో చేసిన మన్మథుడు 2 సినిమా ఆశించిన రిజల్ట్ ని అందించలేదు, 2019లో మన్మథుడు 2 సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్న రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు రష్మికతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ బయటకి వచ్చాయి.
రష్మిక పేరులో నుంచి RA, గీత ఆర్ట్స్ పేరులో నుంచి GA, రాహుల్ రవీంద్రన్ పేరులో నుంచి RAని తీసుకోని #RaGaRa అంటూ అనౌన్స్ అయిన ఈ మూవీకి మేకర్స్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే టైటిల్ కి ఫిక్స్ చేసారు. టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసారు. ఇందులో రష్మిక వాటర్ లో మునిగి ఉండగా… తన కళ్లతో ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసింది. ఈ సమయంలో ‘ఆ పిల్ల నాది’ అంటూ వచ్చిన డైలాగ్ వింటుంటే… ఇదేదో థ్రిల్లింగ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. హేషఎం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానున్న ఈ మూవీ రష్మికని ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
Here’s the announcement glimpse of my next directorial project. Very grateful to the universe to be starting another film:)
Cannot wait to start shooting with the bundle of positive energy that is @iamRashmika 🤗🤗#TheGirlfriend
With Eng Subs👇🏽https://t.co/j6Ow7sHbel pic.twitter.com/pUZaG9WADe
— Rahul Ravindran (@23_rahulr) October 22, 2023