రష్మిక మందన్న లీడ్ రోల్లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మొదట స్లోగా ప్రారంభమైన ఈ సినిమా, మంచి మౌత్‌టాక్‌తో వీకెండ్లో వేగం అందుకుంది. దీంతో బుధవారం హైదరాబాద్‌లో ఈ మూవీ విజయోత్సవ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్–రష్మికల మధ్య ఉన్న బాండింగ్ గురించి చాలా రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించడంతో అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్ నెలకొంది. ఈ సందర్భంగా రష్మిక విజయ్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మిక మాట్లాడుతూ.. “విజ్జు ఈ సినిమాకి మొదటి నుంచే సపోర్ట్ ఇచ్చాడు. నా జీవిత ప్రయాణంలో కూడా అతను ఒక ముఖ్యమైన భాగం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విజయ్ దేవరకొండ ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే అది నిజంగా ఒక వరం,” అని రష్మిక తెలిపింది. అలాగే విజయ్ కూడా రష్మికను ప్రశంసిస్తూ, “రాష్‌ను నేను చాలా ఏళ్లుగా చూస్తున్నాను. ఆమె ప్రతిరోజూ ఎదుగుతోంది. నేను దూకుడుగా ఉంటాను, కానీ ఆమె ఎల్లప్పుడూ దయను ఎంచుకుంటుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఒక ఎమోషన్, ఒక పర్పస్. ఈ సినిమాతో నిలబడ్డ రష్మికపై నాకు గర్వంగా ఉంది,” అని అన్నారు. ఇక వీరిద్దరి విషయానికి వస్తే — రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఒక పీరియాడికల్ డ్రామాలో మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.