Ranbir Kapoor Summoned By Enforcement Directorate: నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. మహదేవ్ గేమింగ్ యాప్ కేసులో విచారణ కోసం ఈడీ ఈ సమన్లు పంపిందని తెలుస్తోంది. అక్టోబర్ 6న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నటుడ్ని ఈడీ కోరింది. రణబీర్ కపూర్ మహాదేవ్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో చాలా మంది బాలీవుడ్ నటులు, గాయకులు దర్యాప్తు సంస్థ ఈడీ స్కానర్‌లో ఉన్నారు. యూఏఈలో జరిగిన ఈ యాప్ ప్రమోటర్ వివాహానికి, సక్సెస్ పార్టీకి ఆయన హాజరు కావడంపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. మహాదేవ్ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కేసులో ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.417 కోట్ల నగదు, ఆస్తులను జప్తు చేసింది.
Hebah Patel : మూడ్ గురించి ప్రశ్న.. ఇంటర్వ్యూలోంచి లేచివెళ్లిన హెబ్బా పటేల్
సెంట్రల్ ఏజెన్సీ ఈడీ చెబుతున్న దాని ప్రకారం, దుబాయ్ నుండి రాకెట్ నడుపుతున్న ఇద్దరు కింగ్‌పిన్‌లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ఈ బెట్టింగ్ యాప్ నుంచి రూ. 5,000 కోట్లు సంపాదించారు. ఇక ఈ కంపెనీ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్ అనేది అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్‌లను ప్రారంభించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేసే ఒక సిండికేట్ అని చెబుతున్నారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ UAEలోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుండి రన్ అవుతుందని ఏజెన్సీ విచారణలో తేలింది. కొత్త వినియోగదారులను, ఫ్రాంచైజీ (ప్యానెల్) అన్వేషకులను ఆకర్షించడానికి బెట్టింగ్ వెబ్‌సైట్‌ల ప్రకటనల కోసం ఇండియాలో కూడా పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేయబడుతుందని గుర్తించారు.