Hebah Patel Quits From a Interview:హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే వెబ్ సినిమా ఈ నెల అక్టోబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. గతంలో తెలిసినవాళ్ళు పేరుతొ రిలీజ్ కావలసిన సినిమాను ఆహా కొనుక్కుని ఈ మేరకు పేరు మర్చి రిలీజ్ చేస్తోంది. మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించగా రామ్ కార్తీక్, నరేష్, పవిత్రా లోకేష్, జయ ప్రకాశ్ తదితరులు మిగిలిన పాత్రధారులు కాగా ఈ సినిమా ప్రమోషన్లలో పెద్ద ఎత్తున పాల్గొంటోంది హెబ్బా పటేల్. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు ఫస్ట్ బాగానే ఉన్నానని చెప్పిన ఆమె, ఆ తర్వాత అర్థం కాక అయోమయం ఫేస్ పెట్టి చివరకు హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయింది.
Mounika Reddy: భీమ్లా నాయక్ బ్యూటీ విడాకులు.. అసలు నిజం ఇదే..?
అయితే ఇది ప్రాంక్ వీడియో కాదని నిజంగా జరిగిందని తెలుస్తోంది. ముందుగా హెబ్బా రాగానే ఈమెను యాంకర్ ఎలా ఉన్నారు అని అడిగి.. ‘మీ మూడ్ బాగుందా’ అంటూ ప్రశ్నించారు. హా ఓకే అని అంటే యాంకర్ దాన్ని మరింత పొడిగిస్తూ ‘మీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, అందుకే ముందే అడుగుతున్నా, మీతో మాట్లాడొచ్చా అన్న మీనింగ్‌తో మాట్లాడుతున్నా’ అని అడిగాడు. హెబ్బాకు అర్థం కాకపోవడంతో..మీరు ఫ్రీగానే ఉన్నారా.. మీ మూడ్ బాగుందా అని మాత్రమే అడిగానని,అనే సరికి, మూడ్‌తో కనెక్షన్ ఏముందీ ఇది ప్రమోషన్ కదా అని ప్రశ్నిస్తూ.. తాను ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకోవడం లేదని సీరియస్‌గా లేచి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.