దగ్గుబాటి రానా చాలా సినిమాలు చేసి ఉండొచ్చు… డైరెక్టర్ తేజ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని చేసి ఉండొచ్చు… కానీ ఈ ఇద్దరు కలిసి చేసిన నేనే రాజు నేనే మంత్రి మూవీ మాత్రం రానా అండ్ తేజ కెరీర్స్ లోనే ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా తేజాలోని కొత్త దర్శకుడిని పరిచయం చేస్తే, రానా నుంచి మంచి ఛేంజ్ ఓవర్ చూపించింది. ఈ మూవీలో హీరో డైలాగ్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో రానా చెప్పిన డైలాగులని ఎదో ఒక విషయంలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కాజల్-రానా ట్రాక్, మ్యూజిక్, ఎమోషనల్ క్లైమాక్స్, లాస్ట్ సీన్ లో రానా ఇచ్చే స్పీచ్… ఇలా ప్రతి విషయంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రానా చేసిన పెర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్ అనే చెప్పాలి.
ఇలా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ది బెస్ట్ మూవీని ఇచ్చిన హీరో-డైరెక్టర్ కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. రాజు మంత్రి కాకుండా ఈసారి రానాని రాక్షసుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు తేజ. ఈరోజు రానా బర్త్ డే కావడంతో రానా-తేజ ప్రాజెక్ట్ కి సంబందించిన అప్డేట్ ని రిలీజ్ చేసారు. ‘రాక్షస రాజా’గా టైటిల్ ఫిక్స్ చేసి రానా-తేజాలు అనౌన్స్ చేసారు. రాక్షస రాజా టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో రానా… నామాలు పెట్టుకోని, చుట్ట తాగుతూ, ఒక గన్ ని భుజాన వేసుకోని వైల్డ్ గా కనిపిస్తున్నాడు. మరి ఈ రాక్షస రాజు, నేనే రాజు నేనే మంత్రి రేంజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#RakshasaRaja Begins 🔥🔥 pic.twitter.com/CeabZPCejE
— Rana Daggubati (@RanaDaggubati) December 14, 2023