Ramya Krishnan:టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఆమె మరోపక్క డ్యాన్స్ ఐకాన్ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఈ షోలో తాజాగా ఒక కంటెస్టెంట్ రమ్యకృష్ణ సాంగ్ ను పెర్ఫార్మ్ చేసింది. ఆ డ్యాన్స్ కు ముగ్దురాలైన రమ్యకృష్ణ అప్పటి రోజులను గుర్తుచేసుకోంది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే.. నా అల్లుడు చిత్రంలో సయ్యా సయ్యారే. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు వర ముళ్ళపూడి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్ సరసన శ్రీయ, జెనీలియా నటించగా.. అత్తగా రమ్యకృష్ణ నటించింది. పొగరుబోతు అత్తను, మామను కలపడానికి ఎన్టీఆర్ వేసిన ఎత్తులే నా అల్లుడు సినిమా.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఇంటి నుంచి పంపకుండా ఉండడానికి రమ్యకృష్ణ తన అందాన్ని అడ్డుగా వేసి సయ్య సయ్యారే అంటూ సాంగ్ పాడుతోంది. ఇక ఈ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయమేంటంటే ఆ సాంగ్ చేసేటప్పుడు రమ్యకృష్ణ నాలుగు నెలల గర్భవతి అంట.. ఈ విషయాన్నీ ఆమె డ్యాన్స్ ఐకాన్ షో లో పంచుకుంది. “ఎన్టీఆర్ తో ఈ సాంగ్ కు డ్యాన్స్ చేసేటప్పుడు నేను నాలుగు నెలల ప్రెగ్నెంట్.. అందుకే ఈ సాంగ్ ను అంత త్వరగా మర్చిపోలేను. ఈ సాంగ్ తో మరోసారి ఆ రోజులను గుర్తుచేశారు” ఇక ఆ సాంగ్ లో మాస్ స్టెప్స్, ఎన్టీఆర్ ఎనర్జీ వేరే లెవల్ అని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రమ్యకృష్ణ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.