మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచేశాడు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో రవితేజ నటిస్తున్న సంగతి తెల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్ మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మార్చి 1న టీజర్‌తో పాటు విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం.
ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సోనీ లైవ్ దక్కించుకుంది. భారీ ధరను వెచ్చించి ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఖిలాడీ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజా ఈ సినిమాతో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.