Ramarao On Duty Director Sarath Mandava Special Request To Audience: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా రేపు (జులై 29) థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతోన్న శరత్ మండావా.. ప్రేక్షకులకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. ఇదొక కంటెంట్ ఆధారిత సినిమా అని, ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు రావాలని, మొదట్నుంచి చివరి దాకా ఏ సన్నివేశమూ మిస్ కావొద్దని కోరాడు.
‘‘ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా రామారావు ఆన్ డ్యూటీ సినిమా చూసేందుకు థియేటర్లకు రండి. మాస్ మహారాజా శైలికి తగ్గట్టు పూర్తి కంటెంట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. సినిమా మొత్తం రామారావు పాత్ర చుట్టే తిరుగుతుంది. మొదటి సన్నివేశం దగ్గర నుంచి రోలింగ్ టైటిల్స్ దాకా ఏ సన్నివేశమూ మిస్ కావొద్దని నేను రిక్టెస్వ్ చేస్తున్నా. సినిమా చూశాక బయట ఏమీ రివీల్ చేయొద్దని దయచేసి వేడుకుంటున్నా’’ అని శరత్ మండావా ట్వీట్ చేశాడు. చూస్తుంటే.. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, అందుకు భిన్నంగా ఉండబోతోందని శరత్ తన ట్వీట్ ద్వారా సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. రవితేజ ఫ్యాన్స్‌ని సంతృప్తిపరిచే ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉన్నాయంటున్నాడు.
కంటెంట్ ఆధారిత సినిమాల్లో రవితేజని చూసి చాలాకాలం అవుతోంది. ఈమధ్యకాలంలో అతడు చేసిన కొన్ని ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి. మరి, రామారావు ఆన్ డ్యూటీ ఎలా ఉండబోతోందో చూడాలి. కాగా.. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్, రజిశా విజయన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంతో చాలాకాలం తర్వాత వేణు తొట్టెంపూడి వెండితెరకు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో అతడు ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.