Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ రామ్ గోపాల్ వర్మ. పొలిటీషియన్స్ బయోపిక్స్ తీసి కాంట్రవర్షియల్ చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. ఇక మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్ ను కలిసిన వర్మ..జగన్ బయోపిక్ తీస్తున్నా అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ జగన్ బయోపిక్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాన్ని జగన్ బయోపిక్ అనలేమని చెప్పుకొచ్చాడు. ” నేను జగన్ బయోపిక్ తీయడం లేదు.. రాజశేఖర్ రెడ్డి మృతిచెందాకా జగన్ ఎలా ఉన్నాడు.. ఏం చేశాడు.. ఎలా ఇక్కడివరకు వచ్చాడు అనేది మాత్రమే చూపించాలనుకుంటున్నాను.
జగన్ ఎప్పుడు పుట్టాడు.. ఎలా పెరిగాడు.. ఎక్కడ చదువుకున్నాడు ఇలాంటివేమీ నా స్టోరీలో లేవు. ఇప్పటివరకు నేను చూసిన జగన్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తాను. ఇక నేను ఏది చేసినా దానిని తప్పు. పట్టించుకోను. ఇప్పటికే కథ పూర్తి అయ్యింది. వచ్చేనెల నుంచి షూటింగ్ మొదలు కానుంది: అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈసారి జగన్ స్టోరీ తో ఎన్ని వివాదాలను సృష్టిస్తాడో చూడాలి.