Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో విజయ్ చాలా బిజీగా గడిపేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లు పనిచేశా. ప్రతి రోజూ ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ వచ్చేది. దీని కోసం అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా మా అమ్మకు టైమ్ ఇవ్వేలేదు. నా గర్ల్ ఫ్రెండ్ కు టైమ్ ఇవ్వలేదు. చాలా బిజిగా గడిపేశా. అదే నాకు బాధగా అనిపిస్తుంది. ఈ మూవీ అయిపోయిన తర్వాత వారికి టైమ్ ఇవ్వాలని ఉంది.
Read Also : Ruchi Gujjar : హీరోను చెప్పుతో కొట్టిన హీరోయిన్..
నా గర్ల్ ఫ్రెండ్ తో గడపాలని ఉంది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా. నేను మొదట్లో సినిమాలు ఆడుతాయనే నమ్మకంతో స్టేజి మీద ఏదేదో మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు రిలీజ్ కు ముందు రోజు వరకు నాకు ఏదీ అర్థం కావట్లేదు. ఇది హిట్, ఇది ప్లాప్ అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే సినిమాలు చేయడం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఏది హిట్ అవుతుందో నేను నిర్ణయించలేను. అందుకే ఈ మధ్య ఏది పడితే అది మాట్లాడకుండా కామ్ గా ఉంటున్నా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో నాకు ఇది కొత్తగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ కొన్ని రోజులుగా రష్మికతో లవ్ లో ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పట్లేదు. తరచూ వీరిద్దరూ బయట తిరుగుతూనే ఉన్నారు. మూవీ రిలీజ్ అయ్యాక మరోసారి రష్మికతో ట్రిప్ కు ప్లాన్ వేస్తున్నాడని తెలుస్తోంది. కింగ్ డమ్ ను గౌతమ్ తిన్నమూరి డైరెక్ట్ చేశాడు. భాగ్య శ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇందులో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ పాత్రలో నటించాడు విజయ్.
Read Also : Payal Rajput : పాయల్ అందాల సోయగాలు.. చూశారా..