Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauzi Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, మేకర్స్ కూడా చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఏకకాలంలో రెండు యూనిట్లు పని చేస్తున్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. మెయిన్ యూనిట్ హైదరాబాద్‌లోని గండిపేట పరిసరాల్లో ప్రభాస్‌తో పాటు ఇతర కీలక నటీనటులపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తోందట. కథకు కీలకమైన ఈ ఎపిసోడ్‌ను డైరెక్టర్ హను రాఘవపూడి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రెండో యూనిట్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. ఒకేసారి రెండు యూనిట్లతో షూటింగ్ నిర్వహిస్తుండటంతో సినిమా పనులు వేగంగా పూర్తవుతున్నాయని సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న వేగాన్ని చూస్తుంటే, ముందుగా ప్రకటించినట్లే డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. భారీ నిర్మాణ విలువలు, హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై రోజురోజుకూ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..