మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చరణ్ ఈ సినిమా తరువాత గ్యాప్ లేకుండా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక చిన్న గ్యాప్ దొరికినా భార్య ఉపాసనతో వెకేషన్ కి చెక్కేస్తూ ఉంటాడు చరణ్.. ఇక రేపు తమ 10 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా చెర్రీ- ఉపాసన లు టూర్ కులం చెక్కేశారు. తమ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ను ఇటలీ లోని అందమైన లొకేషన్లలో చేసుకోనున్నారు. ఇక తాజాగా చెర్రీ.. తమ వెకేషన్ లోని అందమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఈ ఫోటోలో చరణ్, ఉపాసన ట్విన్నింగ్ డ్రెస్ లో కనిపించారు. ఇద్దరు వైట్ అండ్ వైట్ డ్రెస్ లలో ఎంతో అందంగా కనిపించారు.. ముఖ్యంగా చరణ్ ఈ డ్రెస్ లో తండ్రి చిరంజీవిని గుర్తుచేస్తున్నారు అంటే ఆశ్చర్యం లేదు.. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చిరు ఎలా ఉన్నాడో .. ఇప్పుడు చరణ్ కూడా అలాగే కనిపిస్తున్నాడని మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ జంటకు అభిమానులు ముందుగానే వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.