సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్. పోయిన గురువారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా… మొదటి వారంలో మొత్తంగా 450 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. రోబో 2.O, పొన్నియన్ సెల్వన్, కబాలి, విక్రమ్ సినిమా తర్వాత ఐదో చిత్రంగా జైలర్ నిలిచింది.
ఈ వీకెండ్ వరకు 500-550 కోట్ల మార్క్‌ని టచ్ చేయడం గ్యారేంటీ అని లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆ ప్రిడిక్షన్ ని నిజం చేస్తూ ఫ్రైడే స్టార్ట్ అవ్వగానే జైలర్ కలెక్షన్స్ లో మళ్లీ జోష్ కనిపిస్తుంది. కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్, మల్లువుడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో జైలర్ షోస్ కంప్లీట్ గా ఫుల్ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ మూడు రోజుల పాటు రజినీ ర్యాంపేజ్ కనిపించడం గ్యారెంటీ. సెప్టెంబర్ 7న షారుఖ్ నటిస్తున్న జవాన్ సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఇండియా నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో జైలర్ సినిమా హౌజ్ ఫుల్స్ రాబడుతూనే ఉంటుంది. మరి ఫుల్ రన్ లో జైలర్ ఎక్కడి వరకూ వచ్చి ఆగుతుంది? ఎన్ని రికార్డులని లేపుతుంది అనేది చూడాలి.