Rajinikanth fans attacked a Vijay fan at theatre premises: రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతోంది. సినిమా కథ కొత్తగా లేకున్నా రజనీకాంత్ సూపర్ స్టైలిష్ గా కనిపించడం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటివి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లాయి. ఇక ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జైలర్ బాలేదని కామెంట్ చేసిన ఒక విజయ్ అభిమానిని రజనీ అభిమానులు చుట్టుముట్టి చావు చితక్కొట్టారు. నిజానికి గత కొన్నాళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీ- విజయ్ అభిమానుల మధ్య వివాదం నడుస్తోంది. గత నెలలో జరిగిన జైలర్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో మాట్లాడిన రజనీ కాకి, డేగను పోలుస్తూ ఓ కథ చెప్పాడు. ఆ కథలో ఆయన చెప్పిన కాకి నటుడు విజయ్ అని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీంతో గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో విజయ్, రజనీ అభిమానుల మధ్య వివాదం నడుస్తోంది. ఇరువర్గాల అభిమానులు పరస్పరం ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు.
Bhola Shankar: భోళాశంకర్ టికెట్ రేట్ల పెంపు వివాదం ఏంటి? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
ఈ వివాదాల మధ్య రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైన క్రమంలో సినిమా విడుదలను రజనీ అభిమానులు పండగలా జరుపుకుంటున్నారు. తమిళనాడు చెన్నైలోని వెట్రి థియేటర్ లో 9 గంటలకు తొలి షోను ప్రదర్శించారు. ఈ సినిమా చూసేందుకు కొంత మంది విజయ్ అభిమానులు కూడా వచ్చారు. అలా వచ్చి థియేటర్‌లో రజనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రజనీ అభిమానులు నినాదాలు చేసిన విజయ్ అభిమానిని కొట్టారు. విజయ్ అభిమానులు థియేటర్ నుంచి బయటకు వచ్చి “రజనీకి వ్యతిరేకంగా కేకలు వేయడంతో, వారు అతనిని వెంబడించి థియేటర్ తలుపు వద్ద కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ విడుదలై అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ట్విటర్‌లో గొడవ పడిన విజయ్-రజినీ అభిమానులు ఇప్పుడు ఏకంగా తన్నులాటకి దిగడంతో ఈ ఘటనను పలువురు ఖండిస్తున్నారు. ఈ ఘటనతో ఆ థియేటర్ లో ఉత్కంఠ నెలకొంది.
#Rajinikanth fans attack a Vijay fan at theatre premise for saying #Jailer is not good.
What a shame!! Don't encourage violence 🤦♂ #JailerFDFS #JailerReview pic.twitter.com/gFk8bJ2nJW
— Films Spicy (@Films_Spicy) August 10, 2023