Bhola Shankar Ticket Rate Hike Issue: భోళాశంకర్ సినిమా టికెట్ రేట్ల పెంపు వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లను పెంచమని ప్రభుత్వాన్ని మేకర్స్ కోరారు. అయితే ఈలోపే చిరంజీవి ప్రభుత్వం మీద కొన్ని కామెంట్లు చేయడం కలకలం రేపింది. దీంతో టికెట్ రేట్లు పెంచకుండా ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే అసలు విషయం ఏమిటి? ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతోంది అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేమంటే టికెట్ రేట్లు పెంచాలి అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమా బడ్జెట్ వంద కోట్లు, 20 శాతం సినిమా షూటింగ్ ఏపీలో జరగాలి. ఈ క్రమంలో భోళాశంకర్ నిర్మాతలు సినిమా బడ్జెట్ 101 కోట్లు అని లేఖ ఇచ్చారు కానీ బడ్జెట్ ఖర్చుకు సంబంధించిన సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించలేదని తెలుస్తోంది. అలాగే 20 శాతం షూటింగ్ కు సంబంధించి కూడా భోళాశంకర్ సినిమా టీం ఆధారాలు సమర్పించలేదని తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీన టికెట్ల పెంపు కోరుతూ దరఖాస్తు చేసుకున్న చిత్ర యూనిట్ కి ఈ డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా ఈ నెల 2వ తేదీనే ప్రభుత్వం కోరింది.
Vijayasai Reddy: ఫిలిం స్టార్స్ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. చిరు వ్యాఖ్యలకి సాయి రెడ్డి మార్క్ కౌంటర్
సినిమా యూనిట్ క్లెయిమ్ చేసుకున్న బడ్జెట్ కు సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నస్, ఆడిట్ నివేదిక కూడా సినిమా నిర్మాత సమర్పించలేదని అంటున్నారు. అంతేకాక టీడీఎస్, జీఎస్టీ రిటర్న్ రిపోర్ట్ లను సమర్పించాలని ప్రభుత్వం కోరగా అవి కుడా దాఖలు చేయలేదని, బ్యాంకు స్టేట్ మెంట్లు, ఖర్చుకు సంబంధించిన ఇన్వాయిస్‌లను కూడా భోళాశంకర్ నిర్మాతలు సమర్పించలేదని తెలుస్తోంది. 25 రోజుల పాటు విశాఖ పోర్టు, అరకులో షూటింగ్ జరిగిందని సినిమా నిర్మాతలు పేర్కొనగా దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ప్రభుత్వం కోరింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్, సినిమా సినాప్సిస్ సైతం మూవీ టీం సబ్మిట్ చేయలేదని అంటున్నారు. మొత్తం 12 అంశాలకు సంబంధించిన వివరాలు కోరుతూ ప్రభుత్వం తరపున స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్‌డీ ఈ నెల 2వ తేదీన లేఖ రాశారు. అయితే ఇంత వరకు భోళాశంకర్ సినిమా బృందం ఈ విషయం మీద స్పందించలేదు అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరి చూడాలి ఏమవుతుంది అనేది.