Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్ టైంలో ఇలా అన్ని మాస్ మాసాలాలు కలబోసిన సినిమా రాలేదని.. మాస్ జాతర సినిమాను థియేటర్లలో చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఛాలెంజ్ విసిరాడు. తాను ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తే బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయని.. కానీ రవితేజతో అలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తనకు లేకపోవడం కొంత బాధ కలిగించిందని చెప్పాడు.
Read Also : Rashmika : అది మంచిది కాదు.. వర్కింగ్ అవర్స్ పై రష్మిక కామెంట్స్
రీసెంట్ టైమ్స్ లో రవితేజ కెరీర్ ను చూసిన తర్వాత.. మాస్ జాతరతో చాలా పెద్ద హిట్ పడుతుందని నమ్ముతున్నట్టు తెలిపాడు. రవితేజ ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నాడని.. కొన్ని రకాల సీన్స్ ను అడిగి మరీ పెట్టించుకున్నాడని తెలిపాడు. ఈ సినిమాను కచ్చితంగా ధియేటర్లలోనే చూడాలని.. ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడితే బాగోదని అందుకే చాలా విషయాలు దాచిపెడుతున్నట్టు తెలిపాడు రాజేంద్రప్రసాద్. రవితేజ ఏ సినిమాలో అన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలిపాడు.
Read Also : Samantha : సమంత సినిమాలో విలన్ గా క్రేజీ యాక్టర్..